Top 5 This Week

Related Posts

సిరిసిల్లలో నక్సల్స్ జెండాల కలకలం

సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వెలసిన ఎర్ర జెండాల ఘటన కలకలానికి దారి తీసింది. చందుర్తి మండలం సనుగుల, రామారావుపల్లె, కిష్టంపేట, బండపల్లి గ్రామాల్లో ‘సీపీఐ ఎంఎల్’ పేరుతో వెలసిన ఎర్ర జెండాలు నక్సల్ పార్టీ చర్యగా భావిస్తున్నారు. అయితే ఈ జెండాలు ఏ తీవ్రవాద పార్టీకి చెందినవనే అంశంపై క్లారిటీ లేదు. గతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో జనశక్తి పార్టీ నక్సలైట్ల ప్రాబల్యం ప్రామాణికంగా బహుషా అదే పార్టీకి చెందినవారి చర్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వెలసిన ఎర్ర జెండాలను తొలగించారు.

Popular Articles