Top 5 This Week

Related Posts

అమెరికాలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మృతి

విజయవాడ: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ ఎండీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం అమెరికాలో మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ అక్టోబర్ 29, 2026 రాత్రి తుదిశ్వాస విడిచారు.

1994 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఏఎస్పీగా, ఒంగోలు ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఐజీగా, రవాణా శాఖ కమిషనర్‌గా, ఈ-ప్రగతి అథారిటీ సీఈఓగా, ఆర్టీజీఎస్ (RTGS) సీఈఓగా పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరున ఆయన ఐపీఎస్‌గా పదవీ విరమణ చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఏపీ, తెలంగాణా సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు..

Popular Articles