Top 5 This Week

Related Posts

‘సామినేని’ హత్య కేసులో నిందితులు ఎవరంటే..?

ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మెంటల్ శ్రీను, నూకల లింగయ్య, మల్లారపు లక్ష్మయ్య, కర్లపూడి ఉదయ్ కుమార్ అలియాస్ రుక్మాన్ కుమార్ అనే వ్యక్తులు సామినేని రామారావును హత్య చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

హత్యకు గురైన సామినేని రాామారావు (ఫైల్ ఫొటో)

ఈమేరకు ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన ఆయా నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. సాంకేతిక ఆధారాలు, పలు కోణాల్లో దర్యాప్తు అనంతరం ఈ నలగురుని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. రాజకీయ, ఆర్థిక విభేదాలే రామారావు హత్యకు కారణంగా ప్రాథమికంగా తేలిందని, తదుపరి దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు.

నిరుడు అక్టోబర్ 31వ తేదీన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సామినేని రామారావును నిందితులు అత్యంత దారుణంగా కత్తులతో హత్య చేశారు. ఈ హత్యోదంతంపై రాజకీయ ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఏడాదిపాటు పరిశోధన సాగిన ఈ కేసును ఛేదిస్తూ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

సామినేని రామారావు హత్య కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

Popular Articles