Top 5 This Week

Related Posts

ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణా ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఈనెల 26వ తేదీనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పరిణామాల్లో ఈనెల 18వ తేదీన తెలంగాణా హైకోర్టు అతనిపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్ పై 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అనర్హత అమలులోకి వచ్చినట్లు హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

ఈ అంశంలో దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.

Popular Articles