Top 5 This Week

Related Posts

తెలంగాణాలో 17 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది డీఎస్పీలను తెలంగాణా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. సైబరాబాద్ ఏసీపీగా కె. బాలక్రిష్ణారెడ్డిని, భూపాలపల్లి డీసీఆర్బీ డీఎస్పీగా ఎస్కే అబ్ధుల్ రహమాన్ ను, జగిత్యాల డీసీఆర్బీ డీఎస్పీగా ఎ. రవికుమార్ ను, డీజీ కంట్రోల్ రూం డీఎస్పీగా బి. నందిరామ్ నాయక్ ను, టీజీపీఏ డీఎస్పీగా బి. సోమనారాయణ సింగ్ ను, మెదక్ డీసీఆర్బీ డీఎస్పీగా జె. వెంకటేశ్వర్ రావును, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా బి. కిషన్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వు ఇచ్చారు.

అదేవిధంగా హైదరాబాద్ సీటీసీ ఏసీపీగా ఎల్. రమేష్ కుమార్ ను, సంగారెడ్డి డీసీఆర్బీ డీఎస్పీగా ఎన్. శ్రీనివాసరెడ్డిని, టీజీపీఏ డీఎస్పీగా కడారు వెంకటరెడ్డిని, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీగా కోమట్ల సుబ్బరామిరెడ్డిని, హైదరాబాద్ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా ఎస్. సుదర్శన్ ను, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా ఎన్. శంకర్ ను, వెస్ట్ జోన్ రోడ్ సేఫ్టీ డీఎస్పీగా పి. విజయ్ కుమార్, డీజీపీఏ డీఎస్పీగా కె. భాస్కర్ ను, సీఐడీ డీఎస్పీగా ఎం. వెంకటనర్సయ్యను బదిలీ చేశారు. కాగా మల్కాజిగిరి సైబర్ క్రైం ఏసీపీగా పనిచేస్తున్న ఎస్జీ శివకుమార్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

ఆయా పోలీసు అధికారుల బదిలీ పూర్తి ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు..

Popular Articles