Top 5 This Week

Related Posts

తాతా మధు అరెస్ట్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గల తన నివాసంలోనే తాతా మధును మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. తాతా మధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని సైతం కోకాపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కులం పేరుతోపాటు అసభ్యంగా దూషించారని స్పీకర్ ఓఎస్డీ పి. వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తాతా మధును అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య వ్యాఖ్యల వీడియోలోని కాప్చర్ ఫొటో

స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఉద్ధేశిస్తూ ఎమ్మెల్సీ తాతా మధు నిన్న చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాతా మధు బర్తరఫ్ కు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. మంగళవారం కూడా అసెంబ్లీ సమావేశాల్లో తాతా మధు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై చర్చ జరగనున్న నేపథ్యంలోనే అతని అరెస్ట్ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

Popular Articles