హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈనెల 26వ తేదీనే కేసు నమోదైనప్పటికీ, విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడనే అభియోగాలపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
ఇంటర్వ్యూ పేరుతో తనను ఫ్లాట్ కి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, ఈ నెపంతో తనను శారీరకంగా వాడుకున్నాడని, తనకు తెలియకుండా ప్రయివేట్ వీడియోలు చిత్రీకరించడానికి యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేగాక రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బు తీసుకున్నాడని, తన ఫోన్ యాక్సెస్ చేసి తన స్నేహితురాలిని కూడా ఇదే తరహాలో సన్నిహితమయ్యడాని బాధితురాలు ఆరోపించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై బీఎన్ఎస్ చట్టంలోని 69, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:

