Top 5 This Week

Related Posts

Wow: సముద్రమంత నది…!

(సమీక్ష ప్రత్యేకం)
ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాలో అపారమైన చమురు నిల్వలైతే ఉన్నాయిగానీ.. గుక్కెడు మంచినీరు దొరకడం కష్టం. తాగునీరు, ఇతర అవసరాల కోసం మధ్యధరా సముద్రపు నీటిని డీ శాలినేట్ చేసి వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొత్త ఆయిల్ డిపాజిట్ల కోసం నిరంతరం అన్వేషణ జరుపుతుంటారు ఆదేశంలో. అంతకు మించిన శుభ వార్త ఏమిటంటే భూగర్భంలో ఓ విస్తారమైన నదిని కనుగొన్నారు అక్కడి భూగర్భ శాస్త్రవేత్తలు. లిబియాలో విస్తరించిన సహారా ఎడారి దిగువన ఈ నది ఉంది.

వేల సంవత్సరాల క్రితం సహారా ఎడారి చెట్లు, చేమలతో పచ్చగా ఉన్న కాలంలో వర్షాలు కురిసేవి. అప్పుడు ఈ భూగర్భ జలాశయం ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆయిల్ అన్వేషణలో భాగంగా రిగ్గులతో తవ్వకాలు జరుపుతుంటే 40 వేల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టుగా భావిస్తున్న జలరాశి ఉబికి వచ్చింది. ఆ తర్వాత ఎంత పరిమాణంలో నీరు ఉందనే మ్యాప్ ను రూపొందించారు.

తాజా లెక్కల ప్రకారం భూగర్భ నదిలో 12,36,025 టీఎంసీల నీరున్నట్టు తెలిసి అవాక్కయ్యారు. ఇది ఎంత క్వాంటిటీ అంటే మన మైండ్ బ్లాంక్ అయ్యేంత. మన దేశంలోని అతి పెద్దదైన బ్రహ్మపుత్ర నది బేసిన్ లో ఏటా 18,971 టిఎంసీల నీరు మాత్రమే ప్రవహిస్తుంది. ఇప్పుడా సహారా భూగర్భ నది నుంచి రోజూ 0.25 టీఎంసీల నీటిని వెలికి తీసి రాజధాని ట్రిపోలి, బెంఘాజీ నగరాలతో పాటు ఎడారి అంచున ఉన్న గ్రామాలకు సరఫరా చేయడానికి లిబియా ప్రభుత్వం 4 వేల కిలో మీటర్ల పైపు లైన్ వేస్తోంది. అదీ అసలు విశేషం.

Popular Articles