రాజకీయాలంటేనే వ్యూహాలు పన్నడం, చకచకా పావులు కదపడం, శరం కంటే వేగంగా యాక్షన్ చేయడం.
Single largest అయినంత మాత్రాన పిలవాలని లేదు. గతంలో ఇదే ప్రశ్నతో కాంగ్రెస్ రెండుసార్లు కోర్టుకెళ్లి సాధించలేకపోయింది.
ఇప్పుడు అందరూ “ముందుగా TVK ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. గడువు ఇవ్వాలి” అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే “Open all hours for horse trading కి గవర్నర్ అవకాశమివ్వాలి” అని సూచించినట్లు!.
మిత్రులందరూ S.R.Bommai కేసుని ఉదహరిస్తున్నారు. ఆ కేసులో “article 356 దుర్వినియోగ పరచకూడదు, ప్రజా ప్రభుత్వాన్ని article 356 కింద కూలదోయకూడదు, బలాబలాలు సభలోనే తేల్చాలి, గవర్నర్ అడ్డగోలుగా వెళ్లరాదు” అని సుప్రీం స్పష్టం చేసింది. అంతే తప్ప; గేటు దగ్గర ముందు వరసలో నిలబడ్డవాడిని పిలిచి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టమనలేదు.

కాంగ్రెస్ వారు constitutional spirit, social conventions లాంటి చక్కటి పదాలు వాడుతున్నారు. S.R. Bommai v. Union of India case 1989-1994 మధ్యన (రాజీవ్ టు పి.వి.) నడిచింది. బొమ్మయి నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వాన్ని (21 ఏప్రిల్ 1989) గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య తన విచక్షణాధికారంతో article 356 ప్రయోగించి, కూలదోసి, రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అది.
ఇక, TVK అధినేతకు భారీ కాన్వాయి ఇవ్వడాన్ని గవర్నర్ అర్లేకర్ DGP తదితరులను మందలించారు.
మిత్రులకు గుర్తుందో లేదో… 2023లో DGP అంజనీకుమార్ సస్పెండ్ అయ్యారు. ఒకపక్క తెలంగాణ ఎన్నికల ఫలితాలు వస్తుండగానే అత్యుత్సాహంతో రేవంతరెడ్డి (అప్పటికి PCC అధ్యక్షుడు)ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. Next hourలో అంజనీకుమార్ EC వేటుకి గురయ్యారు. Officially announced or declared అనేంతవరకు ఇష్టానుసారం వ్యవహరించకూడదు.
ఇవన్నీ సరే, “నన్ను పిలవకపోతే మా వాళ్లతో resign చేయిస్తా” అన్నారట TVK అధినేత విజయ్. తదుపరి ప్రత్యామ్నాయానికి గవర్నర్ వెళ్తారు. అలా resign చేయగానే ఇలా ఎన్నికలు పెట్టరు. ఆరు నెలలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్.
ఏమో, ఆ లోపల గుర్రమెగురావచ్చు, సూది బెజ్జంలో ఏనుగు దూరవచ్చు, ఎవరికి తెలుసు!
✍️ మణి భూషణ్
సీనియర్ జర్నలిస్ట్

