హైదరాబాద్: ‘‘రాఘవ కన్ స్ట్రక్షన్స్ తెలంగాణా ప్రజలకు తెలుసో, లేదోకానీ, మిస్టర్ అబద్ధాల రావు, డ్రామాలరావు, శకుని మామా.. రాఘవ కన్ స్ట్రక్షన్స్ మోచేతి నీళ్లు తాగినోళ్లు మీరు.. ప్రజలకు తెలుసో, లేదోకానీ, ఈ అబద్ధాలరావుకీ, డ్రామాలరావుకీ బాగా తెలుసు. అంతేకాదు మాయమాటలు చెప్పి నన్ను మీ పార్టీలోకి తీసుకువచ్చి గొంతుకోసిన తర్వాత, నీ పార్టీకి ఇదే రాఘవ కన్ స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా, వైట్ గా కోటి రూపాయలు ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా.. అబద్ధాలరావ్? అప్పుడే తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారా డ్రామాల్రావ్? మోచేతి నీళ్లయితే ఒక్క కోటి రూపాయలతో కాదు.. ఈ మోచేతి నీళ్ల స్టోరీ ఏంటో నీ అంతరాత్మకి తెలుసు..’’ అని తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై, పలువురు మంత్రులపై బీఆర్ఎస్ నాయకులు హరీష్‌రావు, కేటీఆర్‌లు చేస్తున్న పలు ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ధనసరి సీతక్క, పొన్నంప్రభాకర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, మందుల సామెల్ , బి.లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్, రాంమోహన్ రెడ్డి తదితరులతో కలిసి పొంగులేటి మాట్లాడారు.

శకుని మామ కేసీర్ డైరెక్షన్లో అబద్దాల హరీష్‌రావు, డ్రామారావు కేటీఆర్ లు తమ ప్రభుత్వంపై, మంత్రులపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని మామలు.. ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. నాదర్ గూల్, వట్టినాగులపల్లి, కొత్వాల్‌గూడ భూములపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను పొంగులేటి తిప్పికొట్టారు.
తన కుమారుడు హర్షారెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోణలపైనా మంత్రి రియాక్టయ్యారు. ‘నా కొడుకును దీంట్లో పార్టనర్ అంటాడు. ఏ మూడు కంపెనీలు దీంట్లో పార్టనర్లు అంటున్నాయో, ఏ కంపెనీలో ఈ భూమిని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలలో నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే.. ఛాలెంజ్.. అబద్ధాల రావు ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, అవుట్ డేటెట్ కేస్ తెచ్చి, దాన్ని ఇదిగో అని అబద్ధాన్ని పేపర్ చూపించి చిత్రీకరించొద్దని ఖబర్దార్.. అని వేదికగా హెచ్చరిస్తున్నా…’ అని పొంగులేటి పేర్కొన్నారు.

’’గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కథ చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయంట. సింహం అడవి పంది ఎదురుపడ్డాయంట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వది చేయలేవు, నువ్విది చేయలేవు. ఎత్తుగా లావుగా ఓ ఉన్నవ్.. అని ప్రేలాపనలు పలుకుతుందట. పేలి సింహానికి ఒక స్టేజీలో కోపం వచ్చిందట.. వస్తే సింహం రెండొడగులు ముందుకు వేసేసారికి అడవి పంది పక్కనే పెద్ద బురద గుంటలో పోయి.. మొత్తం బురద పూసుకొచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అది బురద రాసుకుంటే, సింహం బురద రాసుకుంటది’’ అని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నాయకులనుద్ధేశించి కథ చెప్పారు.
‘‘పది సంవత్సరాల్లో ఏదైతే రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయం పడుతోందో.. ఆ టీం అబద్ధాల రావు గానీ, డ్రామా రావు గానీ, శకుని మామ కానీ ఎలా తాపత్రయ పడుతున్నారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక్క మూడు అంశాలే కాదు, ప్రతిరోజూ నిరంతరం ఒంటి నిండా విషం నింపుకొని, ఈ విషాన్ని ఎట్ల, మనం ఎట్లా మునిగిపోయం, ఒంటి నిండా ఎలా బుదర అంటింది. ధరణిలో జరిగిన అవకతవకలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ లో రెండు జిల్లాలది వచ్చింది. మిగతా జిల్లాలది రాబోతుంది. అవన్నీ పెట్టక ముందే, మనకంటిన బురద వారికి పూస్తే ఇద్దరం బురద రాసుకున్నోళ్లం అవుతామని పగటి కలలు కంటున్నారు’’ అని మంత్రి అన్నారు.
మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చి, అధికారంలో దిగే ముందుకు డ్రామాలరావు గారు కానీ, అబద్ధాల రావు గారు కానీ, శకుని మామ గారెకి కానీ, వారి కుటుంబానికి ఉన్న ఆస్తులెంతా? ఈనాడు మీకున్న ఆస్తులెంత. మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అని పొంగులేటి ప్రశ్నించారు.

’’ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్టుగా చెప్పారు.. మీకు చాలెంజ్ విసిరారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ కు రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం ఉందని.. రోడ్లకు మెటల్ పంపే కంపెనీ మీద సీబీసీఐడీ ఎంక్వైరీ వేస్తూ, ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడిపై ఆరోపణలు చేస్తే, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి ఆ కంపెనీకే కాదు, విదేశాలకు వేలాది కోట్ల రూపాయల సంపద తరలించిన కంపెనీలపై కూడా సీబీసీఐడీ విచారణ. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గనుల శాఖ పది సంవత్సరాల పాలనలో అబద్ధాలరావు, డ్రామారావు, శకుని మామ ముగ్గురే మంత్రులు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సీబీసీఐడీ ద్వారా ఎంక్వైరీలో వస్తుంది.’ అని మంత్రి అన్నారు.
’’వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం, భయబ్రాంతులను చేయాలని ఇలా తాటాకు చప్పుళ్లు చేస్తేనో, ఇలా కారుకూతలు కూస్తేనో, ఇందాక చెప్పిన గజ్జికుక్క, అడవి పందిలా చేస్తేనో ప్రభుత్వం భయపడదు. చాలా స్పష్టంగా చెబుతున్న, అడవి పంది ఎలా బురదను పూసుకొచ్చి సింహానికి పూయాలని తాపత్రయ పడితే, ఆ సింహం తిరగబడి అడవి పందిని బురదలోంచి లేకుండా తొక్కి చూపిస్తుంది. మీ అక్రమాలు చిట్టా మీ భూదందాల చిట్టా, మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి మా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటకు తీసే సందర్భంగా తప్పకుండా తొందర్లో ఉంటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది “అని మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో అన్నారు

