Top 5 This Week

Related Posts

పెట్రోల్ బంకుల్లో జనం బారులు.. డీలర్ల సంఘం కీలక ప్రకటన

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ బంకుల్లో జనం బారులు తీరుతున్న దృశ్యాలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణాలో ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్తగా పేర్కొంది. దీనివల్ల ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని తెలిపింది. ఈమేరకు తెలంగాణా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. అమరేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

​ ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదని ఆయన చెప్పారు. ​భయంతో ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడంవల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు విక్రయాలు పెరిగాయని, దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు, కానీ అది కొరత కాదని స్పష్టం చేశారు.

అదేవిధంగా ​ పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధమని, ఇది చాలా ప్రమాదకరమని, అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని ఆయన పేర్కొన్నారు. ​ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయవద్దని అసోసియేషన్ కోరుతోందని, ​తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమరేందర్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు.

Popular Articles