కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రశేఖర్ భార్య దివ్య ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలకు అత్తగారిల్లు అయిన సీతంపేటకు ఎస్ఐ చంద్రశేఖర్ వచ్చారు. భార్య ఆత్మహత్య ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ అత్తగారింట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడడం జిల్లా పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులకు అశ్వత్థామ (10), అభిమన్యు (6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.



