హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. రోహిత్ రెడ్డి పాల్గొన్న పార్టీలో డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై సమాధానం ఇవ్వాల్సిందిగా పార్టీ ఆదేశించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యుడు సోమ భరత్ కుమార్ పేరుతో ఈ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నోటీసులకు వారం రోజుల్లో జవాబు ఇవ్వాలని రోహిత్ రెడ్డికి నిర్దేశించారు.
ఈ అంశంలో మీపై వచ్చిన ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమేగాక పార్టీ ప్రతిష్టకు, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. నిర్దేశించిన గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో ఫెయిలైతే, పార్టీ నియమావళి ప్రకారం తగిన క్రమశిక్షణాత్మక చర్యలను ఎటువంటి అదనపు నోటీసు ఇవ్వకుండానే తీసుకోబడుతుందని షోకాజ్ నోటీసులో సోమ భరత్ పేర్కొన్నారు.
పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ జారీ చేసిన షోకాజ్ నోటీస్ ప్రతిని దిగువన చూడవచ్చు..


