ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు మన దేశంపై ప్రభావం చూపినట్లే కనిపిస్తోంది. ఫలితంగానే మన దేశంలో గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని సమాచారం. ఇంటి అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా రూ. 60 పెరిగింది. అదేవిధంగా కమర్షియల్ గా వినియోగించే సిలిండర్ పై రూ. 115 పెరిగింది. ఈమేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు గత అర్ధరాత్రి నుంచే అమలులోకి రావడం గమనార్హం. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇంటి అవసరాకలు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు పెరిగింది. ఇక ఢిల్లీలో రూ. 913, ముంబయిలో రూ. 912.50, కోల్ కతాలో రూ. 939, చెన్నయ్ లో రూ. 928.50కు చేరుకుంది. అయితే ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని చమురు సంస్థలు ప్రకటించాయి. పశ్చమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగానే ఈ ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు.

