Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మిమ్నల్ని మేం గమనిస్తున్నాం: జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్

హైదరాబాద్: ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తోందని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కలెక్టర్లు మంచి పని చేస్తే ప్రభుత్వం అభినందిస్తుందని, వార్షిక పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ల పనితీరును తెలుసుకుంటామని పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై జిల్లా కలెక్టర్లకు దిశా, నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

  • ఆషామాషీగా ఐఏఎస్ కాలేరు.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది.
  • క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.
  • కలెక్టర్లుగా క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ఎప్పటికీ మీకు ప్రజల సమస్యలు అర్థం కావు.
  • కనీసం నెలకు 10 రోజులైనా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశిస్తున్నా.
  • ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే.
  • కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేయాలి.
  • మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలి.
  • గ్రామాలవారీగా సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు,లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి.
  • ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి.
  • ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఒక అధికారికి బాధ్యత ఇవ్వాలి.
  • ఆ అధికారి విద్యార్థులతో పాటు పాఠశాలలో భోజనం చేయాల్సిందే.
  • కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి.
  • ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
  • పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు.
  • ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
  • వంద నియోజకవర్గాల్లో, నియోజకవర్గానికి ఒక మండల కేంద్రంలో నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం.
  • ఆరుట్ల తరహాలో అన్ని రకాల వసతులతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నాం.
  • ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదిక అందించాలి.
  • వైద్యంపై ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోంది.
  • భవిష్యత్ లో అన్ని మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని భావిస్తున్నాం.
  • పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
  • బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
  • అలాంటి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయి.
  • మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే.
  • మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిందే.
  • ఇసుక మాఫియా , అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం.
  • జూన్ లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.
  • 99 రోజుల కార్య‌క్ర‌మాల్లో వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, మున్సిప‌ల్ వార్డు స‌భ్యులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లను భాగ‌స్వాముల‌ను చేయాలి.
  • వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లు అంద‌రికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాలి.. వారి విధులు, బాధ్య‌త‌లకు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియ‌ల్ వారికి అందించాలి.
  • సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. వ్య‌వ‌సాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి.. సోలార్ మోటార్ల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలను రైతుల‌కు వివ‌రించాలి. ఇళ్ల‌పైన సోలార్ ప్లాంట్లు అమ‌ర్చుకోవ‌డం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవ‌గాహ‌న కల్పించాలి.
  • గ్రామ, వార్డు స‌భ‌ల్లో నూత‌నంగా ఇచ్చిన రేష‌న్ కార్డులు, స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌, రుణ‌మాఫీ, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ ల‌బ్ధిదారుల వివ‌రాలు తెలియ‌జేయాలి. వాటితో గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గం, జిల్లా స్థాయి క‌లిగిన ల‌బ్ధిని ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాలి.
  • రాష్ట్రంలో ఉన్న 35 ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందేలా చూడాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇత‌ర స్థానిక వైద్య సంస్థ‌లు ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కే రిఫ‌ర్ చేయాలి.. మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన ప‌రిక‌రాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెస‌ర్లు ఉన్నారు.. వారి సేవ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి.
  • ప్ర‌తి ప్ర‌భుత్వ ప‌థ‌కం ల‌బ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్‌) చేప‌ట్టాలి.. అర్హుల‌కు క‌చ్చితంగా ల‌బ్ధి జ‌ర‌గాలి. అదే స‌మ‌యంలో అన‌ర్హులు ల‌బ్ధిపొంద‌కూడ‌దు. ఆస‌రా పింఛ‌న్ల‌లో ముఖ గుర్తింపు చేప‌ట్ట‌డంతో 3 ల‌క్ష‌ల మంది అన‌ర్హుల పేర్లు తొల‌గించ‌గ‌లిగాం.. సాంకేతిక‌త‌ను స‌రిగా వినియోగించుకోక‌పోవ‌డంతోనే ఇంత పెద్ద సంఖ్య‌లో అనుచిత ల‌బ్ధి పొందారు.
  • ర‌వాణా శాఖ డాటా ఆన్‌లైన్ పూర్తి చేయాలి. పాఠ‌శాల‌లు బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల‌కు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ల‌తో పాటు లారీలు, ఇత‌ర స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల డ్రైవ‌ర్ల‌కు కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. ఎక్కువ సంఖ్య‌లో డ్రైవ‌ర్లు క‌లుసుకునే చోట్ల‌నే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి.
  • ర‌హ‌దారుల‌పై భారీ స్థాయిలో గుంత‌లు, ప్ర‌మాదం జ‌రిగే స్థ‌లాల వివ‌రాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబ‌ర్ ను ర‌వాణా శాఖ ఇవ్వాలి. ఆ నంబ‌ర్‌కు వ‌చ్చే స‌మాచారం ఆధారంగా అక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టడం, ఇత‌ర జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చేయాలి.
  • ఓఆర్ఆర్‌, ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త‌, ఇత‌ర నిర్మాణ వ్య‌ర్ధాలు డంప్ చేస్తున్నారు. వ్య‌ర్ధాల‌ను తీసుకువ‌చ్చే వాహ‌నాల‌ను ప‌ట్టుకొని జ‌రిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి .
  • మ‌ధ్యాహ్న భోజ‌న ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించాలి. పిల్ల‌ల‌కు పోషకాహారం అందాలి. అందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించుకోవాలి.
  • మూడు కార్పొరేష‌న్ల‌తో పాటు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్ట‌ళ్లు, బాయ్స్‌, గ‌ర‌ల్స్ హాస్ట‌ళ్ల వివ‌రాలు న‌మోదు చేసుకోవాలి. ఆయా హాస్ట‌ళ్ల ఏర్పాటుకు అనుమ‌తులు, వాటిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాలి. వాటి యాజ‌మాన్యాల‌కు జ‌వాబుదారీత‌నం ఉండాలి.
  • పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో గంజాయి, డ్ర‌గ్స్‌, ఈ-సిగ‌రెట్ల వినియోగం జ‌రిగితే అందుకు ఆయా విద్యా సంస్థ‌ల యాజ‌మాన్యాలు బాధ్య‌త వ‌హించాలి.. ప్ర‌తి ప్రైవేటు, కార్పొరేట్ పాఠ‌శాల‌, క‌ళాశాల‌ల్లో స‌బ్జెక్ట్ టీచ‌ర్స్‌, పీఈటీ ఎలా ఉంటారో అలానే సైకాల‌జిస్ట్ ఉండేలా చూడాలి.
  • వ్య‌వ‌సాయ శాఖ భూసార ప‌రీక్ష‌లు చేప‌ట్టి స‌కాలంలో రైతుల‌కు వాటి స‌మాచారం అంద‌జేయాలి. ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుందనే విష‌యం రైతుల‌కు తెలియ‌జేయాలి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట‌లు సాగు చేసేలా అన్న‌దాత‌ల‌ను ప్రోత్స‌హించాలి. పంట మార్పిడి, పంట‌ల వైవిధ్య‌త ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించాలి.
  • యూరియా యాప్‌లో కొంత గంద‌ర‌గోళం ఉన్న‌ట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. దానిని సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలి.. నానో యూరియా ఉప‌యోగాలను క్షేత్ర‌స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న ద్వారా రైతుల‌కు చూపించాలి.
  • వ్య‌వ‌సాయ శాఖ‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి. పంట‌లు వేసే మొద‌లు పంట ఉత్ప‌త్తుల అమ్మ‌కం వ‌ర‌కు స‌రైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక ఉంటేనే ఇబ్బందులు ఎదురుకావు. ఈ విష‌యంలో ఈ రెండు శాఖ‌లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగాలి.
  • క‌లెక్ట‌ర్లు త‌మ త‌మ జిల్లాల్లో పంట‌ల వైవిధ్య‌త‌కు ఉన్న అవకాశాలపై నివేదిక స‌మ‌ర్పించాలి.

Popular Articles