Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

తెలంగాణాలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ఢిల్లీ: తెలంగాణాలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాలు సహా దేశ వ్యాప్తంగా పదవీ కాలం పూర్తవుతున్న 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఇందులో భాగంగానే ఈనెల 26న ఎన్నికల నోటిఫికేషన జారీ చేయనున్నారు. మార్చి 5వ తేదీన నామినేషన్ల దాఖలు, మార్చి 9న ఉపసంహరణ, మార్చి 16వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 పోలింగ్ నిర్వహించి మార్చి 16వ తేదీనే పలితాలు ప్రకటించున్నారు.

Popular Articles