Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఉమ్మడి ఖమ్మంలో మున్సిపల్ మేయర్, చైర్మెన్ల పేర్లు ఖరారు!

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నగర పాలక సంస్థతోపాటు ఏడు మున్సిపాలిటీల్లో ఇల్లెందు మినహా మిగతా కేంద్రాల్లో మేయర్, చైర్ పర్సన్ పదవులు దక్కేవారి జాబితా దాదాపు ఖరారైంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస, సీపీఐల మధ్య పరస్పర ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. తొలి రెండున్నరేళ్లు సీపీఐ, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవులను అధిష్టించే విధంగా రాజకీయ చర్చలు కుదిరాయి. దీంతో సీపీఐకి మేయర్ పదవి దక్కనుంది. గిరిజనులకు రిజర్వు అయిన పదవికి ఈ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఓ అభ్యర్థి పేరును మేయర్ పదవికి ఖరారు చేస్తూ సీపీఐ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో పాలక పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన బలాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం నగర పాలక సంస్థ సహా ఏడు మున్సిపాలిటీల్లో ఇల్లెందు మినహా మిగతా కేంద్రాల్లో మేయర్, చైర్ పర్సన్ పదవులు ఖరారైన వారి జాబితా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇలా ఉండే అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఏవేని సమీకరణలు మారితే తప్ప దాదాపుగా ఈ జాబితాలోని కౌన్సిలర్లే చైైర్ పర్సన్లుగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది.

కొత్తగూడెం మేయర్: మూడ్ గణేష్

మున్సిపల్ చైర్ పర్సన్లు:
ఏదులాపురం: పోకబత్తిని అనిత
సత్తుపల్లి: తోట సుజలారాణి
వైరా: బొర్రా ఉమాదేవి
మధిర: వేమిరెడ్డి లక్ష్మీ తులసి
కల్లూరు: ధరావత్ మోహన్ నాయక్
ఇల్లెందు: ? (ఇంకా ఓ కొలిక్కి రాలేదు)
అశ్వారావుపేట: జూపల్లి శశికళ

Popular Articles