Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

‘తిరుగువారం’ జాతర: మేడారంలో పోటెత్తిన భక్తుల దృశ్యాలు

మేడారం: మహాజాతరను తలపించేలా మేడారంలో బుధవారం ‘తిరుగువారం’ పండుగకు భక్తులు పోటెత్తారు. తమ ఆరాధ్యదైవాలైన సమ్మక్క-సారలమ్మల దర్శనం చేసుకుని మురిసిపోయారు. తిరుగువారం పండుగ సందర్బంగా మేడారంలోని సమ్మక్క పూాజామందిరాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శుద్ది చేశారు. వనదేవతల నిలయాలను అలికి, ముగ్గులు వేశారు. తిరుగువారం జాతర సందర్బంగా నిర్వహించాల్సిన ఈ తరహా ఆచార, సంప్రదాయల ప్రక్రియను సమ్మక్క-సారలమ్మ పూజారులు నిర్వహించారు.

ఈ నేపథ్యంలోనే తిరుగువారం జాతరలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడం విశేషం. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు బుధవారంనాటి తిరుగువారం పండుగకు హాజరయ్యారని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తిరుగువారం జాతర సందర్భంగా మేడారంలో భక్తుల సందడి దృశ్యాలు ఇవీ:

సారలమ్మ గుడి వద్ద అలికి, ముగ్గులు వేస్తున్న దృశ్యం
సమ్మక్క మందిరంలో పూజల నిర్వహణ
జంపన్నవాగులో భక్తుల స్నానాలు
వనదేవతకు ప్రణమిల్లుతున్న భక్తులు
అమ్మవార్ల దర్శనం కోసం..
దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
సమ్మక్క గద్దె వద్ద దర్శనం చేసుకుంటున్న భక్తులు

Popular Articles