మేడారం: తన కోసం వేచి చూస్తున్న అశేష భక్తజనులకు దర్శనమిచ్చేందుకు సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి బయలుదేరింది. సమ్మక్క పూజారులు చిలుకలగుట్టకు వెళ్లి అమ్మవారిని తీసుకువస్తున్న ఉద్విగ్న, ఉత్కంఠభరిత సన్నివేశాన్ని కన్నులపండుగగా భక్తులు వీక్షిస్తున్నారు. సమ్మక్క తల్లి బయలుదేరగానే గౌరవసూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే-47 ఆయుధంతో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలుకల గుట్ట నుంచి వస్తున్న సమ్మక్కకు దారివెట అశేష భక్తజనం చేతులెత్తి దండం పెడుతూ కృపను ప్రసాదించాలని మొక్కుతున్నారు. రాత్రి పది గంటల సమయంలో సమ్మక్క తల్లి తన గద్దెపైకి చేరుకున్నారు.







