Top 5 This Week

Related Posts

‘కులం’తోనూ పొలిటికల్ పదవులు: మంత్రి తుమ్మల

‘కులం’వల్ల కూడా రాజకీయ పదవులు లభిస్తాయని తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుకు లభించిన రాజకీయ పదవులపై మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని స్వర్ణభారతి కళ్యాణమండపంలో జరిగిన కమ్మ మహాజన సభలో తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కులం వల్ల కూడా కొన్ని అవకాశాలు వస్తాయని, ఖమ్మం జిల్లాలో ఎవరికైనా పదవులు వస్తే ‘కమ్మ’ ఆధారితంగానే పదవులు వస్తాయని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా చెప్పారు. తాతా మధు ప్రస్తుతం ఓ పార్టీకి అధ్యక్షుడయ్యారని, చట్టసభలో సభ్యుడయ్యారని, అందుకు కేవలం కులమేనని తుమ్మల వ్యాఖ్యానించారు. కమ్మ, ఖమ్మానికి ఇవ్వాలి కాబట్టి తాతా మధుకు అవకాశం లభించిందని చెప్పారు. అంటే.. కులం కూడా అవకాశాలిస్తుందని అన్నారు. కానీ కులం చరిత్ర, దాతృత్వం, ధీరత్వం, వీరత్వం.. మనం అందులో పుట్టినందుకు దాన్ని నిలపడానికి ప్రయత్నం చేయాలని మంత్రి ఉద్భోదించారు. దాన్ని ఇంకా పెంచితే పెంచాలని, కానీ పూర్వీకులు సృష్టించినటువంటి చరిత్రకు మచ్చ వచ్చే విధంగా మనం బతకవద్దని మంత్రి తుమ్మల హితవు చెప్పారు. ‘కులం’వల్ల లభించే పొలిటికల్ పదవులపై మంత్రి తుమ్మల ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు..

Popular Articles