Top 5 This Week

Related Posts

మావోయిస్ట్ పార్టీ కీలక లేఖ విడుదల

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ఓ కీలక లేఖ విడుదలైంది. సోషల్ మీడియా వేదికగా విడుదలైన ఈ లేఖలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవ్ జీ నియామకపు ప్రస్తావన ఎక్కడా లేకపోవడం గమనార్హం. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆయన స్థానంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్ జీని నియమించినట్లు వార్తలు వచ్చాయి.

తిరుపతి అలియాస్ దేవ్ జీ (ఫైల్ ఫొటో)

ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో పది పేజీలతో కూడిన ఓ సందేశపు లేఖ విడుదలైంది. పార్టీ 21వ స్థాపనా వార్షికోత్సవాలను ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరింది. పార్టీని, పీఎల్జీఏను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని, శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామని మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది. గడచిన ఏడాది కాలంలో ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన సహచరులను గుర్తు చేసుకుంది. అయితే కేంద్ర కమిటీ పేరుతోనే విడుదలైన ఈ లేఖలో ఎక్కడా తిరుపతి నియామకపు ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

Popular Articles