Top 5 This Week

Related Posts

బాలునిపై దాష్టీక లైంగిక దాడి: మహిళా టీచర్ అరెస్ట్

పదహారేళ్ల వయస్సు గల ఓ బాలునిపై పదేపదే లైంగిక దాడికి పాల్పడిందనే అభియోగంపై ఓ మహిళా టీచర్ (38)ను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు ముంబయిలోని ఐస్ ల్యాండ్ లోని ప్రముఖ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే 2023 డిసెంబర్ లో జరిగిన పాఠశాల వార్షికోత్సవంలో ఓ విద్యార్థితో ఇంగ్లీష్ టీచర్ కు పరిచయం ఏర్పడింది. తనకు పెళ్లయిన విషయాన్ని విస్మరించి బాలున్ని ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది.

ఆ తర్వాత పరిణామాల్లో బాలున్ని మచ్చిక చేసుకున్న టీచర్ అతన్ని తన కారులోనే ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ సమయంలో బాలునికి మద్యం తాగించి, యాంటీ యాంక్జైటీ పిల్స్ వాడించి మరీ లైంగిక దాడికి పాల్పడేది. చివరికి స్కూల్లో పరీక్షలు పూర్తయి విద్యార్థి వెళ్లిపోయిప్పటికీ టీచర్ తన లైంగిక వేధింపులను ఆపలేదు. ఈనేపథ్యంలోనే బాలుని ప్రవర్తనలో అతని తల్లిదండ్రులు మార్పును గమనించి అసలు విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

తన ఇంట్లో పనిచేసే సిబ్బందితో బాలుని కోసం టీచర్ మరోసారి కబురు పంపడంతో అనివార్యంగా బాధితుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్ పై పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. టీచర్ కు సహకరించిన ఆమె స్నేహితునిపైనా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితురాలైన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

Popular Articles