Top 5 This Week

Related Posts

ఇవీ భూ భారతి చట్టం కీలకాంశాలు

తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం (కొత్త ఆర్వోఆర్ చట్టం)లో అనేక విశేషాలున్నాయి. మొత్తం 32 పేజీలతో రూపొందించిన చట్టంలో గతంలో గల ధరణి చట్టంలోని లోపాలను, ప్రస్తుత భూ భారతి చట్టంలోని కీలక అంశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల భూముల‌కు పూర్తి భ‌ద్ర‌త‌, భ‌రోసా క‌ల్పించే భూభార‌తి చ‌ట్టాన్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డంతో త‌న జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

గ‌త ప్ర‌భుత్వ దొర‌ల హ‌యాంలో నాలుగు గోడ‌ల మ‌ధ్య న‌లుగురు క‌ల‌సి రూపొందించిన 2020 రెవెన్యూ చ‌ట్టం ‘ధ‌రణి’తో ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. రెవెన్యూ వ్య‌వ‌స్ధ కూడా తెల్ల‌వారుజామున దొర‌గారి మ‌దిలో మెదిలిన ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌రిగెత్త‌లేక‌పోయిందన్నారు. అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించే ఈ చ‌ట్టాన్ని స్వార్ద‌ప్ర‌యోజ‌నాల‌కోసం ఉప‌యోగించుకోవడానికి గ్రామ‌ప‌రిపాల‌నాధికారుల వ్య‌వ‌స్ద‌ను కూడా నాడు ర‌ద్దు చేశారన్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఇత‌ర స‌హ‌చ‌ర మంత్రులు ఎంతో కృషి చేసి రూపొందించిన ఈ చ‌ట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ‌పెడితే బి ఆర్ ఎస్ స‌భ్యులు ఏ విధంగా అప‌హాస్యం చేశారో, అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారో ప్రజలు గ‌మ‌నించాలని కోరారు. అయినప్పటికీ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీని భూభారతి చట్టం ద్వారా నిల‌బెట్టుకున్నట్లు పొంగులేటి చెప్పారు.

భూభారతి చట్టంలో పొందుపర్చిన పూర్తి అంశాలను దిగువన గల పీడీఎఫ్ లో చదవవచ్చు..

Popular Articles