Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

మాములుగుండదు.., గట్టిగనే కొడ్త: కేసీఆర్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాం హౌజ్ వేదికగా తెలంగాణాలో తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. ఎర్రవల్లి ఫాం హౌజ్ లో నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్ధేశించి కేసీఆర్ శుక్రవారం మాట్లాడారు. తెలంగాణాకు ఇదో మంచి గుణపాఠమని వ్యాఖ్యానించారు. అత్యాశకు పోయినవారు కొందరు చెప్పుడు మాటలకు మోసపోయారన్నారు. రైతు భరోసా ఇచ్చినా కూడా మోసమేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు.

తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఏడాదిలోనే ఇంతగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని, కనిపిస్తే కాంగ్రెసోళ్లను ప్రజలు కొట్టేలా ఉన్నారని అన్నారు. వాళ్ల బొంత తెలివికి.. పార్టీవాళ్లే అదేదో పోలింగ్ పెడితే 70 శాత మనకు వచ్చిందని, 30 శాతం వాళ్లకు వచ్చిందని, వాడు పెట్టందేనని, మనం పెట్టిన పోల్ కాదని కేసీఆర్ అన్నారు.

గంభీరంగా తాను అన్నీ చూస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు అలవాటని అన్నారు. ఫిబ్రవరి నెలలో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొత్తంగా నైరాశ్యంలో గల పార్టీ కేడర్ లో జోష్ నింపే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నయానే అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫాం హౌజ్ లో కేసీఆర్ ప్రసంగంలోని కొంత భాగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు..

Popular Articles