Top 5 This Week

Related Posts

‘ఈటెల’కు అస్వస్థత

‘ప్రజాదీవెన’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వీణవంక మండలం కొండపాక వద్ద ఈటెల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు జ్వరం సోకిందని, ఆక్సిజన్, బీపీ లెవెల్స్ పడిపోయినట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈటెల రాజేందర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు.

కాగా మరింత మెరుగైన వైద్యం కోసం ఈటెలను హైదరాబాద్ తరలించారు. ఈనెల 19వ తేదీన తన పాదయాత్రను ప్రారంభించిన ఈటెల ఇప్పటి వరకు 222 కి.మీ. మేర పూర్తి చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లో ఈటెల పాదయాత్ర పూర్తి కాగా, వీణవంక, హుజూరాబాద్ మండలాల్లో యాత్ర కొనసాగాల్సి ఉంది.

Popular Articles