Top 5 This Week

Related Posts

మిల్కా సింగ్ ఇక లేరు

ఫ్లయింగ్ సిఖ్ గా ప్రాచుర్యం పొందిన సుప్రసిద్ధ ఇండియన్ అథ్లెట్ మిల్కా సింగ్ (90) ఇక లేరు. ఛండీగఢ్ లోని పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఆయన తుదిశ్వాస విడిచారు. కోవిడ్ అనంతర సమస్యలతో ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘ భాగ్ మిల్కా భాగ్’ హిందీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే . మిల్కాసింగ్ మృతి పట్ల భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Popular Articles