Top 5 This Week

Related Posts

ఖమ్మంలో ‘ప్రైవేట్’ ఆసుపత్రుల సీజ్

ఖమ్మం నగరంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రయివేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా టాస్క్ ఫోర్స్, హైపవర్ కమిటీలకు చెందిన అధికారులు, వైద్యులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స అందిస్తున్న రెండు ఆసుపత్రులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మరో ఆసుపత్రికి అనుమతి రద్దు చేసినట్లు సమాచారం. సీజ్ చేసిన ఆసుపత్రుల్లోని కోవిడ్ పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఫొటో: ఓ ఆసుపత్రిని సీజ్ చేస్తున్న దృశ్యం

Popular Articles