Top 5 This Week

Related Posts

కరోనాకు ఇద్దరు జర్నలిస్టుల బలి

కరోనా మహమ్మారి ఇద్దరు జర్నలిస్టుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు కరోనా బారిన పడి మంగళవారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ పట్టణానికి చెందిన పడకంటి రమేష్ కు కరోనా సోకడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూనే మృతి చెందారు. రమేష్ తన సొంత పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

అదేవిధంగా సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బుర్ర రమేష్ (46) కూడా కరోనా సోకి చనిపోయారు. పలు దినపత్రికల్లో విలేకరిగా పనిచేసిన రమేష్ కరీంనగర్ లో తొలుత చికిత్స తీసుకున్నారు. పరిస్థితి కుదుటపడకపోవడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. చికిత్స పొందుతూనే రమేష్ మంగళవారం మరణించారు. ఈ రెండు ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టుల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

Popular Articles