Top 5 This Week

Related Posts

జవాన్ రాకేశ్వర్ విడుదల

తమ చెరలో గల సీఆర్పీఎఫ్ జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టు నక్సలైట్లు విడుదల చేశారు. ఈనెల 3వ తేదీన బీజాపూర్ జిల్లా జీరగూడెం-తొర్రెం అడవుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్ ఘటన సందర్భంగా రాకేశ్వర్ సింగ్ ను నక్సలైట్ల బందీగా చిక్కిన సంగతి తెలిసిందే. గడచిన అయిదు రోజులుగా నక్సల్స్ చెరలో గల రాకేశ్వర్ సింగ్ ను ఎన్కౌంటర్ జరిగిన తొర్రెం గ్రామ సమీపాన్నే కొద్దిసేపటి క్రితం విడుదల చేసినట్లు సమాచారం. జీరగూడెం-తొర్రెం గ్రామస్తులకు రాకేష్ ను అప్పగించి నక్సలైట్లు అతన్ని విడుదల చేసినట్లు సమాచారం.

గ్రామస్తుల సమక్షంలో రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసిన చిత్రం

Popular Articles