Top 5 This Week

Related Posts

వైరల్ వీడియో: ఫొటోగ్రాఫర్ వీపు పగిలింది… వధువు పగలబడి నవ్వింది!

విషయం ఏదైనా ‘అతి’ చేయకూడదంటారు. అతివల్ల అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ ఉదంతం కూడా సరిగ్గా అలాంటిదే. ఎక్కడో జరిగిందో తెలియదుగాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయమేమిటంటే… ఓ నవ జంట. పెళ్లి పూర్తయినట్లుంది. బహుషా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నట్లున్నారు.

ఇటువంటి సందర్భాల్లోనే కదా…? మధుర జ్ఞాపకాలను పదిలపర్చుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ఈ ఫంక్షన్ లోనూ వధూ, వరులు స్టేజిపై ఉన్నారు. వారిని ఓ ఫొటోగ్రాఫర్ పోటోలు తీస్తున్నాడు. ఉన్నట్టుండి వరుడు ఫొటోగ్రాఫర్ ను ఒక్కటిచ్చుకున్నాడు. వధువు పగలబడి నవ్వింది. చివరికి వరుడి దెబ్బను రుచి చూసిన ఫొటోగ్రాఫర్ కూడా గత్యంతరం లేక నవ్వుకోవలసి వచ్చింది. ఇంతకీ ఫొటోగ్రాఫర్ చేసిన అతి ఏమిటో, వరుడు ఎందుకు ఆగ్రహించాడో… దిగువన గల వీడియో చూడండి. విషయం మీకే బోధపడుతుంది.

https://twitter.com/Ease2Ease/status/1357675009905291264

Popular Articles