Top 5 This Week

Related Posts

కేంద్రంపై కేసీఆర్ ‘బంద్’ యుద్ధం!

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 8న రైతులు తలపెట్టిన ‘భారత్ బంద్’కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించడం గమనార్హం. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని కూడా ఆయన వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు.

రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు

Popular Articles