Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

కరోనాను ఇలా జయించండి: మంత్రి హరీష్ రావు పిలుపు

కషాయం తాగడం ద్వారా కరోనాను జయించవచ్చని తెలంగాణా రాష్ట్ర ఆర్థిక వాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. ‘కషాయం తాగండి… కరోనాను జయించండి’ అని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కషాయ వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కషాయం తాగండి.. కరోనాను జయించండి.. ప్రభుత్వానికి సహకరించి మిమ్మిల్ని మీరు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఉచిత కషాయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. యోగా, వ్యాయామం చేసేవారు ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు.

సిద్దిపేటకు వచ్చే ప్రజల కోసం 3 వేడినీటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేడినీరు, కషాయం తాగితే కరోనా నుంచి బయటపడొచ్చు అని మంత్రి స్పష్టం చేశారు. అందరూ వేడినీరు, కషాయం తాగడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కరోనా చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ. లక్షలు ఖర్చు చేయొద్దు అని చెప్పారు. కరోనా వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్‌ అందిస్తున్నామని హరీష్‌రావు ఈ సందర్భంగా చెప్పారు.

Popular Articles