Top 5 This Week

Related Posts

BREAKING: కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి !

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా సోకి మరణించాడా? ఇదే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయంటూ ప్రముఖ మీడియా సంస్థలు సైతం వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి.

దావూద్ ఇబ్రహీంతోపాటు అతని భార్య మెహజబీన్ కూడా కరోనా వైరస్ సోకి పాకిస్థాన్ లోని కరాచీ మిలట్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని శుక్రవారం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దావూద్ మృతి చెందినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.

పాకిస్థాన్ కు చెందిన ‘న్యూస్ ఎక్స్’ మీడియా తొలుత ఈ వార్తా కథనాన్ని ప్రచురించగా, సోషల్ మీడియాలో అదే వార్తా కథనం వైరల్ గా మారింది. 1993లో జరిగిన ముంబయి వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితునిగా పోలీస్ రికార్డుల్లో గల దావూద్ పాతికేళ్లుగా అండర్ గ్రౌండ్ లోనే దాక్కుంటున్నాడు.

https://twitter.com/NewsX/status/1269135532925173762

Popular Articles