హైదరాబాద్: తెలంగాణాలో 31 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పనిచేస్తున్న జిల్లా, సెషన్స్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వు జారీ చేశారు.
బదిలీ అయిన న్యాయమూర్తుల్లో డాక్టర్ పి. శివ రామ్ ప్రసాద్, శ్రీమతి డి. సాధన, సుగాలి నారాయణ, టి. శ్రీనివాసరావు, శ్రీమతి కె. ఉమాదేవి, శ్రీమతి వెంపటి అపర్ణ, దేవినేని రాంప్రసాదరావు, ఎం. అర్చనా కుమారి, పి. వాసంతి, శ్రీమతి రాచపూడి శ్రీదేవి, శ్రీమతి మంత్రి రామక్రిష్ణ సునీత, డాక్టర్ పుల్లభట్ల పొగడ క్రిష్ణార్జునరావు, శ్రీమతి జి. సునీతా రవీందర్ రెడ్డి, శ్రీమతి కోట్ల లావణ్యా బాల్ రెడ్డి, ఎం. నాగరాజు ఉన్నారు.
అదేవిధంగా న్యాయమూర్తులు జి. సంపూర్ణ ఆనంద్, టి. శ్రీనివాస్, శ్రీమతి డి. మాధవీ క్రిష్ణ, ఎం. సతీష్ కుమార్, పి. ఆంజనేయులు, శ్రీమతి సి. పావని, ఎన్. సంతోష్ కుమార్, పి. ప్రదీప్ నాయక్, సీహెచ్. చంద్రకిషోర్, శ్రీమతి బి. అపర్ఱాదేవి, శ్రీమతి జి. ప్రేమలత, శ్రీమతి మనీషా శ్రావణ్ ఉన్నం, బాకరాజు శ్రీనివాసరావు, వినోద్ కుమార్, టి. అనిత, డాక్టర్. జి.వి. మహేష్ నాథ్ లు కూడా బదిలీ అయినవారిలో ఉన్నారు.
ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వనపర్తి, సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, ఎల్బ్ నగర్, రాజేంద్రనగర్, కూకట్ పల్లి, వికారాబాద్ కేంద్రాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఆయా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.
బదిలీకి గురైన ఆయా జడ్జీల పూర్తి వివరాలు దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు..

