Top 5 This Week

Related Posts

ఇద్దరు యూ ట్యూబర్ల అరెస్ట్

ఇద్దరు యూ ట్యూబర్లను తెలంగాణా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారనే అభియోగంపై వీరిద్దరినీ అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ అదనపు సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఫిర్యాదు తో ఇద్దరు యూ ట్యూబర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

అరెస్టయిన వారిలో రేవతి, బండి సంధ్య అనే యూ ట్యూబర్లు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో రెండు లాప్ టాపులను, మరో రెండు హార్డ్ డిస్కులను, ఒక లోగో, మరో రూటర్, ఏడు సీపీయూలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేవతిపై గతంలోనూ బంజారాహిల్స్, ఎల్ బీ నగర్ లలో కేసులు ఉన్నట్లు సైబర్ క్రైం అదనపు సీపీ విశ్వప్రసాద్ వివరించారు.

Popular Articles