Top 5 This Week

Related Posts

ULC దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: దశాబ్దాలుగా పెండింగ్‌లో గల అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 2016లోనే ULC కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కారానికి జీవో జారీ చేసినప్పటికీ, అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయినట్లు చెప్పారు. దీంతో ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (ULC) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన GO నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ ULC దరఖాస్తులను పరిశీలన, పరిష్కారానికి ఆదివారం Memo.No.48062/ULC/A1/2026-1, జారీ చేసినట్లు మంత్రి ప్రకటించారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.

కాగా 22A సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జి.ఓ 118కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జి .ఓ 76కు అనుగుణంగా మెమో ఇచ్చమన్నారు. 22ఏ లో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేశామన్నారు.

Popular Articles