Top 5 This Week

Related Posts

ఆరెస్సెస్ శిబిరంలో ఆ ఇద్దరు!

ఈ ఫొటోలో కనిపిస్తున్న నలుగురిలో ఇద్దరు ప్రముఖ నాయకులు ఉన్నారు తెలుసా? ఆహార్యం మార్పు వల్ల ఈ నాయకులను వెంటనే గుర్తించడం కష్టమే కావచ్చు. నిశితంగా పరిశీలిస్తే తప్ప సాధ్యం కాకపోవచ్చు. వీరిలో ఒకరు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెడుతున్నది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ శివార్లలోని భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో సమాయత్త కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్న చిత్రమిది.

Popular Articles