హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డికి తాను బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తమకు రూ. వెయ్యి కోట్లు ఇస్తే తమ ఆస్తులన్నీ ఇస్తామని ప్రకటించారు. రేవంత్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు కొల్లగొట్టిందని రేవంత్ అంటున్నారని, వెయ్యి కోట్లు ఇస్తే తమ ఆస్తులన్నీ ఇస్తామని, మిగతా 99 వేల కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకోసం ఖర్చు చేయాలని సూచించారు.
కాళేశ్వర్యం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందని చేసిన విషప్రారం లాగే ఇప్పడూ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని, ఏమీ చేయలేరని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

