Top 5 This Week

Related Posts

మల్టీ జోన్-1లో 14 మంది సీఐల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని మల్టీ జోన్‌-1 పరిధిలో 14 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. ఉత్తర్వులోని వివరాల ప్రకారం స్థానచలనానికి గురైన సీఐల వివరాలు ఇలా ఉన్నాయి.

  • వెయిటింగ్ లో గల ఎం.డి. సాజిదుల్లాను ఆదిలాబాద్‌ డీటీసీకి, పిండ్ల మల్లయ్యను ఆసిఫాబాద్‌ డీసీఆర్‌బీకి, సిద్ధిపేట పీసీఆర్ లో గల పంజాల మల్లేశ్‌ గౌడ్‌ను నిర్మల్‌ డీసీఆర్‌బీకి బదిలీ చేశారు.
  • వెయిటింగ్ లో గల జిల్లెల్లమడుగు మోహన్‌బాబును సిద్దిపేట పీసీఆర్‌లో నియమించారు. అదేవిధంగా సుంకర శ్రీలతను నిర్మల్‌ డీసీఆర్‌బీకి, ముప్పారపు కరుణాకర్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీఆర్‌కు బదిలీ చేశారు.
  • సీఎస్బీ సిద్ధిపేటలో గల బూర శ్రీధర్‌ను రామగుండం కమిషనరేట్‌ పీసీఆర్‌కు, వెయిటింగ్ లో గల ఎస్‌.కె. లతీఫ్‌ను సిద్దిపేట కమిషనరేట్‌ సీఎస్‌బీకి నియమించారు.
  • రామగుండం సీఎస్బీలో గల ఎంబడి భీమేశ్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్‌కు బదిలీ చేయగా, ఇక్కడ గల ఏవూరి నాగార్జునరావును హైదరాబాద్‌లోని మల్టీ జోన్‌-1 కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
  • ఖమ్మం సీసీఆర్బీలో గల పి. సర్వయ్యను ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలోని సత్తుపల్లి రూరల్‌ (పెనుబల్లి) సర్కిల్‌కు బదిలీ చేశారు. ఇక్కడ గల లక్ష్మీ ముత్తు లింగయ్యను మల్టీ జోన్‌-1 కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
  • వెయిటింగ్ లో గల బోడకుంట్ల రఘుపతిని నిజామాబాద్‌ కమిషనరేట్‌ సీఎస్‌బీకి బదిలీ చేశారు.
  • గోదావరిఖని వన్ టౌన్ లో రెండో సీఐగా ఉన్న సయ్యద్‌ అఫ్జలుద్దీన్‌ను సిద్దిపేట కమిషనరేట్‌ పరిధిలోని గజ్వేల్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండో ఇన్‌స్పెక్టర్‌గా నియమించి, సీఎస్‌బీకి అటాచ్‌ చేశారు.
  • బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి రిలీవ్‌ చేసి, కొత్త స్థానాల్లో రిపోర్టు చేసిన తేదీల వివరాలను మల్టీ జోన్‌-1 కార్యాలయానికి పంపించాలని సంబంధిత యూనిట్‌ అధికారులను ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Popular Articles