హైదరాబాద్: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆదివారం భారీ ధర్నా నిర్వహించింది. యువత ఎదుర్కుంటున్న సమస్యలు, నిరుద్యోగంపై సీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పాలకులను సీజేపీ నాయకులు కోరారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. శాంతియుత నిరసనల హక్కును గౌరవించాలని డిమాండ్ చేస్తూ, ప్రజల గొంతుకను అణచివేసే చర్యలు ఆపాలని హెచ్చరించారు. విద్య, ఉద్యోగాల అంశాలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. జీవన వ్యయాల పెరుగుదలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా స్వేచ్ఛను రక్షించాలని పిలుపునిచ్చారు. అభిప్రాయ స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు నిలిపివేయాలన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించాలని కోరారు. సీజేపీ ధర్నా తెలంగాణాలో రాజకీయంగా చర్చకు దారి తీసింది.
