Top 5 This Week

Related Posts

సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్: ప్రజలకు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక.. శ్రీ పరాభవ నామ ఉగాది పండుగ సందర్భంగా ఆయన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొని ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు.

ఉగాది షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ శుభదినాన్ని ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

Popular Articles