Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

భలే ధైర్యవంతురాలు ఈ పిల్ల.. బైకుపై 2 లక్షల కి.మీ తిరిగింది!

బసంతి – ధన్నో – ఫ్రాంకీ
ఈ మూడు పేర్లు ఇండియాతో లింక్​ అయినవి. రెండు పేర్లు ‘షోలే’ సినిమాలో ఉంటాయి. ‘బసంతి’ హేమమాలిని పేరు, ‘ధన్నో’ అనేది బసంతి నడిపే టాంగా గుర్రం పేరు. మూడోదయిన ‘ఫ్రాంకీ’ ముంబైలో స్ట్రీట్​ ఫుడ్​. వెస్టిండీస్​ మొదటి నల్లజాతి కెప్టెన్​ ఫ్రాంక్​ వోరెల్​ (Frank Worrell) గౌరవార్థం 60వ దశకంలో ఒక పంజాబీ వండిన వంటకం పేరు ఫ్రాంకీ.

ఇక్కడి ఫొటోలోని నొరాలి షూమేకర్​ (Noraly Schoenmaker) నెదర్లాండ్స్​ యువతి. రోడ్​ ట్రావెలర్​. భలే ధైర్యవంతురాలు. ఎప్పుడూ నవ్వుతూ విసుగు చిరాకు లేకుండా బైక్​ డ్రైవ్​ చేస్తుంది.

జియోకెమిస్ట్రీలో పిజి చేశాక, పీహెచ్​డీ కోసం ఆస్ట్రేలియా వచ్చింది. అక్కడి నుంచి న్యూజీలాండ్​, ఇండియాల్లో తిరగడంతో… ఈ భూమి మీద అన్వేషించాల్సిన నేల చాలా ఉందని తెలుసుకుంది. దాంతో పీహెచ్​డీకి మంగళం పాడేసింది. తిరగడానికి డబ్బులు కావాలి కాబట్టి, ఆరేడేళ్లు జియాలజిస్టుగా బహమాస్​, బ్రెజిల్​, కజఖస్థాన్​, మొరాకో లాంటి ఏడెనిమిది దేశాల్లో ఉద్యోగం చేసింది. మధ్య మధ్యలో ట్రావెలింగ్​ కూడా చేసేది.

టాంగాపై హేమమాలిని (ఫైల్ ఫొటో)

హమ్మయ్య, పర్వాలేదు అనుకున్నాక… 2018లో నెదర్లాండ్స్​లోని ఇంటిని అమ్మేసి…ఇండియాలో దిగింది. బ్రాండ్​ న్యూ బులెట్​ (రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​) కొనుక్కొని… ‘బసంతి’గా పేరెట్టుకుంది. భారతదేశం సహా పాతిక దేశాల్లో 30 వేల కి.మీ. తిరిగి నెదర్లాండ్స్​ వస్తే… అక్కడ సేఫ్టీ ప్రమాణాలకు సరిపోదన్న కారణంతో నెదర్లాండ్స్​ ఆర్​టీవో నిరాకరించింది. దాంతో లోకల్​ రాయల్​ ఎన్​ఫీఫీల్డ్​ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి… బసంతి బదులుగా కొత్త హిమాలయన్​ బైక్​ తీసుకుంది. ఈసారి బసంతి తన బైక్ కు గుర్రం ‘ధన్నో’ పేరు పెట్టుకుంది.

ఆమె Itchy boots పేరుతో యూట్యూబ్​ చానల్​ నడుపుతోంది. 32 లక్షల subscribers ఉన్నారు. తన దేశ దిమ్మరి పర్యటన వివరాలన్నింటినీ… ఎప్పటికప్పుడు పోస్టు చేస్తోంది. ఒంటరి ఆడపిల్ల! భిన్న సంస్కృతులు, నేలలు, మనుషుల నడుమ ఇప్పటి వరకు 2,00,000 కి.మీ. పర్యటించింది. మధ్యలో ఓసారి బైకు యాక్సిడెంటులో కాలర్​ బోన్​ విరగొట్టుకుంది కూడా.

ప్రస్తుతం ఆమె రోడ్​ ట్రావెలింగులో సీజన్​–8 నడుస్తోంది. బసంతి, ధన్నో తర్వాత ఈ ఆరేడేళ్లలో అయిదారు బైకులు మార్చింది. ఇప్పుడయితే Frankie (Yamaha Tenere XT 600Z) మీద తిరుగుతోంది.

దేశ దిమ్మరి పర్యటన ఎందుకంటే… నొరాలి హైవేలపై తిరగదు. కంట్రీ సైడ్​ రోడ్లపైనే బైక్​ డ్రైవ్​ చేస్తుంది. మట్టి, బురద, రాళ్లతో నిండిన కచ్చా రోడ్లపై రయ్​ రయ్​ మంటూ దూసుకుపోతుంది అచ్చంగా బసంతి టాంగా మాదిరిగానే!

ఈ ఒంటరి ఆడపిల్ల నొరాలి షూమేకర్ ​(Noraly Schoenmaker) గురించి ఇంకా చాలా రాయొచ్చుగానీ, ఇప్పటికే ఎక్కువైంది.

Popular Articles