మేడారం: మహాజాతర ప్రారంభానికి ముందే మేడారంలో విదేశీ భక్తులు వన దేవతలను దర్శించుకుంటున్నారు. ఈమేరకు న్యూజిలాండ్ లోని మావోరి తెగకు చెందిన భక్తులు సోమవారం మేడారం చేరుకుని సమ్మక్క-సారలమ్మ దేవతలకు ప్రణమిల్లారు. ఈ సందర్భంగా అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన చేశారు.
హాకా నృత్యం అనేది న్యూజీలాండ్ కు చెందిన మావోరి తెగలో ప్రత్యేకం. యుద్ధానికి సన్నద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఆయా దృశ్యాలు సమీక్ష పాఠకుల కోసం..






