Top 5 This Week

Related Posts

సంచలనం: రెండు యూ ట్యూబ్ ఛానళ్లపై పోక్సో కేసు నమోదు

హైదరాబాద్: రెండు యూ ట్యూబ్ ఛానళ్ల కంటెంట్ పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదైంది. ఈమేరకు నిందితులపై బీఎన్ఎస్ చట్టంలోని 67, 67A, 67b, ITA-2000-2008, 294, 79, రెడ్ విత్ 49 సెక్షన్ల కింద, పోక్సో చట్టం 2012లోని 8, రెడ్ విత్ 7, 12, రెడ్ విత్ 11, 14, రెడ్ విత్ 13, 17 రెడ్ విత్ 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. సోష‌ల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది క‌దా అని.. ఏ త‌ర‌హా కంటెంట్ అయినా చేస్తామంటే కుద‌ర‌దన్నారు. చ‌ట్ట‌ప్ర‌కారం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లను పోలీస్ శాఖ తీసుకుంటుందని సజ్జన్నార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Popular Articles