ఖమ్మం మార్కెట్ లోకి బజాజ్ సంస్థ వారి గో గో ఎలక్ట్రిక్ పాసింజర్ ఆటో వచ్చేసింది. పాసింజర్ ఆటో రంగంలో దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో వారు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ‘బజాజ్ గో గో’ పేరుతో విడుదల చేశారు. ఖమ్మంలో తమ అతిపెద్ద అధీకృత డీలర్ వెంకటరమణ ఆటోమొబైల్స్ ద్వారా మార్కెట్లోకి గోగో పాసింజర్ ఆటోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా బజాజ్ కంపెనీ ప్రతినిధులు RM బాబ్జీ మాట్లాడుతూ, బజాజ్ అంటేనే ఒక నమ్మకం, భరోసా అని అన్నారు. బజాజ్ సంస్థను ఇంతలా అందరిస్తున్న తమ కస్టమర్ల కొరకు అతి తక్కువ మెయింటెనెన్స్ తో సుమారు 250 కి.మీ. మైలేజ్ తో కొత్త బజాజ్ గోగో ని అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. బజాజ్ ఇక ముందు గోగో గా మారిపోతుందని చెప్పారు.

వీవీసీ గ్రూప్ సంస్థల అధినేత వీవీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బజాజ్ ఆటోని ఇంతలా అందరిస్తున్న తమ కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ప్రపంచమంతా మెచ్చిన బజాజ్ పాసింజర్ ఆటో ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలో బజాజ్ గోగో గా రావటం అభినందనీయమని అన్నారు. బజాజ్ గోగో పవర్ ఫుల్ 12 kwh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 250 కి.మీ.పైగా మైలేజ్ ఇస్తుందని చెప్పారు.

బజాజ్ గోగో EV రెండు మోడల్స్ లో లభ్యమవుతుందని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆకర్షణీయమైన డిజైన్ తో, పూర్తి మెటల్ బాడీ కలిగి, రెండుస్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్ తో, ఆటో డేంజర్, యాంటీ రోల్ డిటెక్టివ్, LED లైట్స్ తో లభ్యమవుతుందన్నారు. బజాజ్ గోగో EV రెండు వేరియంట్ లలో ఎక్స్ షోరూం ధర రూ. 3,26,797 నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్రవారం రోజు ఒకేసారి పదిమంది కస్టమర్లకు బజాజ్ గోగో ఆటోల డెలివరీ ఇవ్వడం ఆనందదాయకమన్నారు. తమ వెంకటరమణ ఆటోమొబైల్ కస్టమర్ల అభిప్రాయం మేరకు తాము నూతనంగా అప్ గ్రేడ్ చేసిన డబుల్ స్టేర్ షోరూంలో క్విక్ సర్వీస్ క్యాంపు ఉందని, ఈ అవకాశాన్ని బజాజ్ కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో బజాజ్ కంపెనీ ప్రతినిధులు, సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

