Top 5 This Week

Related Posts

‘బ్యూరోక్రాట్ల’పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కొందరు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన టీఎన్ శేషన్ వంటి ఐఎఎస్ అధికారుల నిబద్ధతను, సేవలను కొనియాడుతూనే, ప్రస్తుతం కొందరు సివిల్స్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా వేర్వేరు, సందర్భాల్లో, వేర్వేరు అధికారుల పనితీరును దగ్గరగా చూశానని చెప్పారు.

ఇదే దశలో ప్రస్తుతం కొందరు అధికారులు ఏసీ గదులను వీడడం లేదని, శిక్షణ సమయంలోనే మరికొందరు అధికారులు యూనిఫాం ధరించి మరీ సివిల్ పంచాయతీలు చేస్తున్నారని సీఎం అన్నారు. పాలనాపరంగా తీసుకునే ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఇంకొందరు అధికారులు కొర్రీలు పెడుతున్నారని కూడా సీఎం అన్నారు. అధికారులు నిబద్ధతో పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు సక్సెస్ అవుతాయన్నారు. రిటైర్డ్ ఐఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి-మెమైర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్’ అనే పుస్తకావిష్కరణ సబలో సీఎం రేవంత్ మాట్లాడారు.

సీఎం పూర్తి ప్రసంగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు..

Popular Articles