Top 5 This Week

Related Posts

ఖమ్మం సీపీఐలో తీవ్ర విషాదం

ఖమ్మం జిల్లా సీపీఐ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ (64) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. దినచర్యలో భాగంగా మార్నింగ్ వాక్ చేస్తుండగానే ప్రసాద్ ఉన్నట్టుండి కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పార్టీలో అత్యంత నిజాయితీపరుడైన కామ్రేడ్ గా పేరు గాంచిన ప్రసాద్ ఆకస్మిక మరణంతో సీపీఐ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.

Popular Articles