Top 5 This Week

Related Posts

వరవరరావుకు కరోనా

ప్రజాకవి వరవరరావుకు కరోనా సోకింది. భీమా కోరేగావ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రిజల్ట్ రాగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో గత సోమవారం రాత్రే ముంబయిలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు వెల్లడైంది.

Popular Articles