Top 5 This Week

Related Posts

కరోనా కల్లోలం… 95 ఎకరాల్లో పెళ్లి వేదిక… మాజీ సీఎం ఏర్పాట్ల వీడియో లీక్!

ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుని పెళ్లి అంటే మాటలా? మందీ, మార్బలం, హంగూ, అర్భాటం ఉండాలి కదా? కరోనా కల్లోలంలో ఈ పెళ్లిగోల ఏంటీ…? అనుకుంటున్నారా? అయినప్పటికీ కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇంట పెళ్లి పనులు ఆగడం లేదు. అదే అసలు విశేషం మరి. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు తరహాలో తన గారాల పుత్రుని వివాహానికి కుమారస్వామి చేస్తున్న ఏర్పాట్లు జాతీయ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్.

తన కుమారుని పెళ్లి కోసం కర్నాటకలోని రామనగర జిల్లాలో 95 ఎకరాల విస్తీర్ణంలో వివాహ వేదికను నిర్మించాలని, బంధు, మిత్రులను, శ్రేయోభిలాషులను కలుపుకుని దాదాపు ఐదు లక్షల మందిని ఆహ్వానించాలని కుమారస్వామి భావించారట. పెళ్లి తర్వాత బెంగళూరులో అత్యంత వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నారట. ఈనెల 17వ తేదీన మంచి ముహూర్తం ఉందని, ఎలాగైనా తన కుమారుడు నిఖిల్ గౌడ పెళ్లి జరపాలని కుమారస్వామి నిర్ణయించారట.

కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన కుమారుని పెళ్లికి ఎవరూ రావద్దని పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కుమారస్వామి కోరుతున్నారట. ఈ పెళ్లికి దాదాపు 20 మంది వరకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని ఆయన చెబుతున్నారట. కానీ మరోవైపు పెళ్లి ఏర్పాట్లు మాత్రం భారీగానే సాగుతున్నాయట. ఏర్పాట్లకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ కావడంతో కుమారస్వామి తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్నారని ‘టైమ్స్ నౌ’ మీడియా సంస్థ నివేదించింది. ఆ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనాన్ని దిగువన చూడవచ్చు.

News Input source: TIMES NOW

Popular Articles