Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఇకపై రహస్యాలేవీ ఉండవ్..!

మనమిప్పుడు టెక్నాలజీ పరంగా ఉచ్ఛ దశకు చేరుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెల్లువలా ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇకపై రహస్యం, దాపరికాలంటూ ఏమీ ఉండవ్. జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ బయటపడటం చూస్తున్నాం. బ్రిటన్ రాజు తమ్ముడితో సహా ప్రపంచంలోని అత్యంత ప్రముఖుల వికృత లైంగిక చేష్టలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇకపై స్విస్ బ్యాంకు అకౌంట్లు కావచ్చు. అక్రమ సంపదను భూమిపై ఏ రూపంలో ఎక్కడ దాచినా, ఎవరిపై ఎవరు కుట్రలు చేసినా, నిఘా సంస్థల అత్యంత రహస్య సమాచారాలతో సహా అన్నీ బయటకు వస్తుంటాయి. మనం వాడే యంత్రాలే మనల్ని కనిపెడుతుంటాయి. మనం చేసే సెర్చ్ ల ద్వారా మన ఇష్టాలు, మనం కోరుకునే వస్తువులేమిటో అమ్మకం దారులకు తెలిసిపోతున్నాయి.

ఇద్దరు వ్యక్తులు ఏ కారు కొంటే బాగుంటుందని మాట్లాడుకుంటే వాళ్ల స్మార్ట్ ఫోన్లలో కార్ల మోడళ్ల ప్రకటనలు మొదలవుతాయి. మన మాటలను ఎవరో వింటున్నారు. మనల్ని మరెవరో గమనిస్తున్నారు. ప్రతి కదలికా, మన మేథలోని ఆలోచనలు కూడా ఎంతో కొంత మేరకు యంత్రాలకు తెలిసిపోతూనే ఉన్నాయి. ఒక రోజులో మనం తిరిగిన ప్రదేశాలన్నిటిని మన చేతిలోని స్మార్ట్ ఫోన్ గుర్తిస్తోంది.

క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. వికీలీక్స్ ద్వారా జూలియన్ అసాంజె CIA, FBI ల టాప్ సీక్రెట్లు, hush hush, Under wraps అన్నిటిని పదేళ్ల క్రితమే బయటపెట్టాడు. సమాచార విస్ఫోటనాన్ని ఆపలేం. స్మార్ట్ ఫోన్ చేతిలో లేని వాళ్లు, మిగతా జీవరాశి మాత్రమే హాయిగా ఉంటారేమో అనిపిస్తోంది.

Popular Articles